VIDEO: అనుమతులు లేకుండా ఇసుక తరలింపు

VIDEO: అనుమతులు లేకుండా ఇసుక తరలింపు

PPM: కొమరాడ మండలం బిత్రపాడు, కొట్టు, పాత కల్లికోట గ్రామాల సమీపంలో ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు పోటీ పడుతూ నాగావళి నదిలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఒకే చోట ఇసుక తవ్వకాలు చేపట్టడంతో పెద్ద పెద్ద గోతులు ఏర్పడుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. సంబంధిత శాఖల నుంచి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి, అవి పాటించకుండా వ్యాపారులు ఇసుక రవాణా చేపడుతుని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.