జనసేన నాయకుడు లక్ష విరాళం
W.G: మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లో పర్యాటకులు ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోకుండా రక్షించడానికి ఏర్పాటు చేసిన యాంటీ డ్రౌనింగ్ యుఏవీ డ్రోన్ కోసం నరసాపురం జనసేన నాయకుడు పోలిశెట్టి శ్రీనివాస్ లక్ష రూపాయలు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు డీఎస్పీ శ్రీ వేద కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలోమొగల్తూరు ఎస్సై వాసు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.