'రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం'
SKLM: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కోటబొమ్మాళి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బీ. శేషగిరిరావు అన్నారు. మంగళవారం టెక్కలి వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలతో రైతులకు పెసలు, రాగి, మినుములు, నువ్వులు, కట్టి జనుము, వేరుసెనగ విత్తనాలను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.