VIDEO: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్
కోనసీమ: వ్యవసాయమే మన బ్రతుకుతెరువని, మన రాష్ట్ర అభివృద్ధి వ్యవసాయం మీద ఆధారపడి ఉందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. ఆత్రేయపురంలో సోమవారం ఆయన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్‌లతో కలిసి రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లాలో తొలి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.