VIDEO: S.R.S.P కాల్వలో గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం
హన్మకొండలోని యాదవ్‌నగర్ సమీపంలో S.R.S.P కాల్వలో గల్లంతైన బిహార్‌కు చెందిన ఇద్దరు యువకుల మృతదేహాలు శుక్రవారం లభ్యమయ్యాయి. మస్తాన్, సోనూ అనే యువకులు పండ్లవ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. మంగళవారం చేతులు శుభ్రం చేసుకునేందుకు కాల్వలోకి దిగిన సమయంలో నీటి ఉద్ధృతి కారణంగా గల్లంతయ్యారు. మృతదేహాలను బయటకు తీసిమార్చురీకి తరలించినట్లు కేయూ సీఐ రవి తెలిపారు.