ALERT: రేపు పిడుగులతో కూడిన వర్షాలు

ALERT: రేపు పిడుగులతో కూడిన వర్షాలు

AP: నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర కేరళ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రేపు కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురువనున్నారు. మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.