ప్రత్యేక అలంకరణలో భద్రకాళి అమ్మవారు

ప్రత్యేక అలంకరణలో భద్రకాళి అమ్మవారు

HNK: వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవరోజు ఆదివారం శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు అమ్మవారిని విశేషంగా అలంకరించి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. నేడు సెలవు దినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.