VIDEO: మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్
NZB: ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాన్ని గురువారం అదనపు కలెక్టర్ అంకిత్ కుమార్ సందర్శించారు. ఆయన మున్సిపల్ కార్యాలయంలో అధికారులు విధులు నిర్వహిస్తున్న తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన అధికారులతో పలు అంశాలపై సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్, తదితరులు పాల్గొన్నారు.