రాయదుర్గం విద్యార్థినికి ప్రథమ బహుమతి
ATP: జాతీయ స్థాయిలో జరిగిన చిత్రలేఖనం పోటీల్లో రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన గీతారెడ్డి ప్రథమ బహుమతి సాధించి నియోజకవర్గానికి గర్వకారణంగా నిలిచిందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. కనేకల్లు మండలం హనకనహాల్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న గీతారెడ్డి, 'అంతరిక్ష శాస్త్రం' అంశంపై ఢిల్లీలో జరిగిన పోటీలో ఈ ఘనత సాధించారని అన్నారు.