యాదాద్రిలో ఘనంగా లక్షపుష్పార్చన
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఏకాదశి పర్వదినం సందర్భంగా శాస్త్రోక్తంగా లక్ష పుష్పార్చన నిర్వహించారు. సోమవారం స్వామి అమ్మవార్ల సహస్ర నామ పఠనంతో అర్చక బృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. స్వయంభూ ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవ మూర్తులను పట్టువస్త్రాలతో దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై తీర్చిదిద్దారు.