'స్కాలర్షిప్ నిధులు విడుదల చేసేలా కృషి చేస్తాం'
GDWL: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతూ.. ABVP అలంపూర్ శాఖ విద్యార్థులు ఇవాళ పట్టణ చౌరస్తాలోని MLA విజయుడుకి ఆయన క్యాంపు కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోసం అధికారులు చొరవ తీసుకునేలా కృషి చేస్తానాని విద్యార్థులకు హమీ ఇచ్చారు.