'మేం చనిపోక ముందే మేల్కోండి మోదీజీ!'
ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం(AQI 700) విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి ట్వీట్ చేశారు. 'మోదీజీ, మేము చనిపోకముందే మేల్కోండి. నాకు విపరీతమైన దగ్గు, ఛాతీ నొప్పి వస్తోంది. ఈ విషాన్ని(కాలుష్యాన్ని) యుద్ధ ప్రాతిపదికన తగ్గించండి' అంటూ ఆమె చికిత్స తీసుకుంటున్న వీడియోను షేర్ చేశారు.