'స్థానిక సంస్థలు ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి'

SRD: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పారు. బీసీల సంక్షేమానికి సంఘం కృషి చేస్తుందని పేర్కొన్నారు.