నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన స్టేట్ ఎలక్షన్ అబ్జర్వర్
నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో ఏర్పాటు చేసిన నామినేషన్ క్లస్టర్ సెంటర్‌ను స్టేట్ ఎలక్షన్ అబ్జర్వర్ అయిషా ఆదివారం సందర్శించారు. నామినేషన్ ప్రక్రియను పరిశీలించి ఇలాంటి లోపాలు లేకుండా మార్గదర్శకాలకు అనుగుణంగా నామినేషన్ ప్రక్రియను పూర్తిచేయాలని అక్కడి సిబ్బందికి సూచించారు. వీరి వెంట ఎంపీఓ శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.