నేడు వాటర్ సరఫరాలో మార్పులు
AKP: యోగాంధ్ర సందర్భంగా జీవీఎంసీ అనకాపల్లి జోన్‌లో మంచినీటి సరఫరాను నేడు అనగా శనివారం మధ్యాహ్నం 12 గంటల తరవాతే చేయబడుతుందని మంచి నీటి విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్. శేఖర్ తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు మంచినీటి సరఫరా జరిగేదని అయితే శనివారం మాత్రం మధ్యాహ్నం 12 గంటలకు తర్వాత సరఫరా చేస్తామని తెలిపారు.