కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం

కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం

జగిత్యాల కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ బీ. సత్య ప్రసాద్ 31 ఫిర్యాదులు స్వీకరించారు. అదనపు కలెక్టర్ బీ. రాజగౌడ్, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలను సానుభూతితో విచారించి, తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.