జోగి రమేష్ అరెస్టు అక్రమమే: మేయర్ భాగ్యలక్ష్మి
కృష్ణా: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులను విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రమేష్ అరెస్టు పూర్తిగా అక్రమమని విమర్శించారు. 18 నెలలుగా నిష్క్రియంగా ఉన్న ప్రభుత్వం, అధికారులు ఇప్పుడు ఆయనను జైలులో బంధించి తాత్కాలిక సంతోషం పొందుతున్నారని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని ఆమె వ్యాఖ్యానించారు.