ఘనంగా హనుమాన్ ప్రతిష్టాపన

ఘనంగా హనుమాన్ ప్రతిష్టాపన

JGL: కథలాపూర్ మండల కేంద్రంలో హనుమాన్ ప్రతిష్టాపన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య హోమాలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని అలంకరించి మహా మంగళహారతి ఇచ్చి, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.