హోటళ్ల అసోసియేషన్ అత్యవసర భేటీ
TG: రాష్ట్రంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిపివేయడంతో హోటల్స్ అసోసియేషన్ అత్యవసరంగా సమావేశమైంది. ఈ సమస్యపై నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా హోటళ్ల బంద్‌కు పిలుపునిచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గ్యాస్ కొరత వల్ల వ్యాపారాలు నడపడం కష్టంగా మారిందని, అందుకే ఈ కఠిన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.