తోటపల్లిలో పాస్ పుస్తకాల పంపిణీ
BPT: నగరం మండలం తోటపల్లి గ్రామంలో రీ సర్వే పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి రేపల్లె ఆర్డీవో శ్రీదేవి, నగరం తహసీల్దార్ నాంచారయ్య హాజరయ్యారు. అధికారుల చేతుల మీదుగా రైతులకు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. భూముల రీ సర్వే ఆవశ్యకతను, ప్రయోజనాలను అధికారుల బృందం ఈ సందర్భంగా రైతులకు వివరించింది.