ఎంపీటీసీ ఎన్నికలపై అవగాహన

WNP: అమరచింత మున్సిపాలిటీలోని 5 ఎంపీటీసీ సెగ్మెంట్లలో నమోదైన ఓటర్ల జాబితాపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు సోమవారం అమరచింత ఎంపీడీవో కార్యాలయంలో నేడు అవగాహన కల్పించారు. చంద్రఘడ్, నందిమల్ల, మస్తీపురం, కొంకన్వానిపల్లి సెగ్మెంట్లలో మొత్తం 13,896 మంది ఓటర్లు ఉన్నారని ఎంపీఓ నరసింహయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు.