'ఎయిర్‌పోర్ట్ పనులు 91.7% పూర్తయ్యాయి'

'ఎయిర్‌పోర్ట్  పనులు 91.7% పూర్తయ్యాయి'

SKLM: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మంగళవారం భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ మేరకు పనుల పురోగతి, పూర్తి కావాల్సిన నిర్మాణాలు, తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు 91.7% పనులు పూర్తయ్యాయని అన్నారు. 2026 జూన్ నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు.