అక్రమ ఇసుక రవాణా.. పట్టించుకోని అధికారులు
SRPT: మోతె మండలం నర్సింహపురం పాలేరు వాగులో అక్రమ ఇసుక రవాణా బహిరంగంగా కొనసాగుతోంది. ఆదివారం వాగు నీటిలోకి దిగి ఇసుకను తట్టల్లో నింపి, తెప్పలపై తరలించి ట్రాక్టర్లకు చేరుస్తున్న కార్మికులు కనిపిస్తున్నారు. రోజువారీగా జరిగే ఈ అక్రమ తరలింపుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.