రైల్వే కోడూరు విద్యార్థి బేస్బాల్ పోటీలకు ఎంపిక

రైల్వే కోడూరు విద్యార్థి బేస్బాల్ పోటీలకు ఎంపిక

అన్నమయ్య: రైల్వే కోడూరు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2025 నవంబర్ 15 నుంచి 17 వరకు జరిగిన రాష్ట్రస్థాయి బేస్‌బాల్ పోటీలలో, అదే కళాశాలకు చెందిన జి చైతన్య కుమార్ జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అతను త్వరలో ఢిల్లీలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని కళాశాల ప్రిన్సిపాల్ జి యశోదర, ఫిజికల్ డైరెక్టర్ చంద్రమోహన్ రాజు తెలిపారు.