నాదెండ్ల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ట్రైనీ డీఎస్పీ
PLD: నాదెండ్ల పోలీస్ స్టేషన్‌ను నరసరావుపేట ట్రైనీ డీఎస్పీ కె. జయకృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది పనితీరును సమీక్షించి, స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను ఎస్సై వెంకటేశ్వరరావును అడిగి తెలుసుకున్నారు. అలాగే రిజిస్టరును పరిశీలించి, కేసుల విచారణ వేగవంతం చేయాలని సూచించారు.