వ్యవసాయంలో డ్రోన్ వినియోగం ప్రయోజనకరం

ELR: వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంతో అనేక విధాలుగా ప్రయోజనం కలుగుతుందని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. బుధవారం కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంపై గ్రూప్ కన్వీనర్లకు, అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో 27 మండలాల్లో తొలివిడతగా ప్రభుత్వ సబ్సిడీపై డ్రోన్లను అందించేందుకు ధరఖాస్తులు తీసుకుంటామన్నారు.