'ఎయిడ్స్ అంటువ్యాధి కాదు.. అంటించుకునే వ్యాధి'

NDL: ఎయిడ్స్ అంటువ్యాధి కాదు అంటించుకునే వ్యాధి అని డాక్టర్ అన్వర్ హుస్సేన్ అన్నారు. మంగళవారం నందికోట్కూరులోని ప్రభుత్వ గాంధీ మెమోరియల్ పాఠశాలలో ఎయిడ్స్‌పై అవగాహన కల్పించారు. హెచ్ఐవి అంటే ఏమిటి, అది ఎలా వ్యాపిస్తుంది అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎయిడ్స్ వస్తే తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.