అంతర్గాం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ
PDPL: రామగుండం కమిషనర్ పరిధిలోని అంతర్గాం పోలీస్ స్టేషన్‌ను సీపీ అంబర్ కిషోర్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించడంతో పాటు, స్టేషన్ భౌగోళిక పరిస్థితులు, సిబ్బంది పనీతీరు, స్టేషన్ పరిధిలో అధికంగా నమోదయ్యే కేసుల వివరాలతో పాటు, గ్రామాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్ సిబ్బందితో మాట్లాడి రికార్డ్‌లను పరిశీలించారు.