1,750లీటర్ల బెల్లం ఊట ధ్వంసం.. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు

1,750లీటర్ల బెల్లం ఊట ధ్వంసం.. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు

కర్నూల్: కోడుమూరు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో స్టేషన్ పరిధిలోని వెల్దుర్తి మండలం లక్ష్మీపురం వద్ద నిర్వహిస్తున్న నాటుసారా స్థావరంపై సోమవారం పోలీసులు దాడులు నిర్వహించారు. 1,750లీటర్ల బెల్లం ఊట, 15లీటర్ల సారాను ధ్వంసం చేసినట్లు సెబ్ సీఐ రామాంజనేయులు తెలిపారు. సారా బట్టి నిర్వహిస్తున్న అదే ప్రాంతానికి చెందిన బోయ అశోక్, అయ్యప్ప స్వామిపై కేసు నమోదు చేశారు.