నేటి నుంచి ఈ ప్రాంతాలలో ఆధార్ సేవలు

నేటి నుంచి ఈ ప్రాంతాలలో ఆధార్ సేవలు

SKLM: పోలాకి మండలం లోని చీడివలస, దీర్ఘాసి, ఉరజాం తల సముద్రం, కోడూరు తదితర గ్రామాల్లో నేటి నుంచి ఈ నెల 26 వరకు ఆధార్ సేవా కేంద్రాలు నిర్వహిస్తామని ఎంపీడీవో రవికుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇంత వరకు కార్డు తీసుకోని వారు, మార్పులు చేర్పులు చేయాలనుకునే వారు వీటిని వినియోగించుకోవాలని కోరారు. సచివాలయ సిబ్బంది సకాలంలో హాజరై సేవలందించాలని అన్నారు.