ఇద్దరు జూదరులు అరెస్ట్

ఇద్దరు జూదరులు అరెస్ట్

అన్నమయ్య: పేకాట ఆడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు మదనపల్లె 1 టౌన్ ఎస్సై శివకుమార్ తెలిపారు. బుధవారం నీరు గట్టు వారి పల్లె సమీపంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం అందడంతో సిబ్బందితో కలిసి దాడి చేశామన్నారు. దాడిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుల నుంచి రూ. 6 వేలు నగదు 3 సెల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.