జనగామ జిల్లాలో మహిళల ఓటర్లు కీలకం
జనగామ జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో మహిళల ఓట్లు కీలకం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 50 శాతానికి పైగా మహిళా ఓటర్లు ఉన్నారు. మొత్తం 1,72,506 ఓటర్లు ఉండగా అందులో 85,180 పురుష ఓటర్లు, 87,322 మహిళా ఓటర్లు ఉన్నారు. దీంతో మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి ఆయా పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అభ్యర్థుల గెలుపోటములు మహిళలు ప్రభావితం చేయనున్నారు.