వాల్మీకి మహర్షి విగ్రహానికి ఎమ్మెల్యే లక్ష విరాళం
ATP: ఆత్మకూరు మండలం పి. కొత్తపల్లిలో రూ. కోటి నిధులతో శనివారం బీటీ రోడ్డు, సీసీ రోడ్లు, వాటర్ ప్లాంట్‌ను ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రారంభించారు. అనంతరం 'రైతన్నా-మీకోసం' కార్యక్రమంలో పాల్గొని పంటలను పరిశీలించారు. చీనీ, కంది దిగుబడి తగ్గడంపై ఆమె అధికారులతో మాట్లాడారు. బీసీ కాలనీలో వాల్మీకి మహర్షి విగ్రహానికి లక్ష విరాళం ప్రకటించారు.