2028 ఎన్నికలపైనే మా దృష్టి: సిద్ధరామయ్య
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే భేటీ అయిన విషయం తెలిసిందే. కేసీ వేణుగోపాల్ సూచనల మేరకు బ్రేక్‌ఫాస్ట్ భేటీ జరిగినట్లు సిద్ధరామయ్య వెల్లడించారు. 'మేము ఏమీ చర్చించలేదు.. ఇద్దరం కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశాం. 2028 ఎన్నికలు, స్థానిక ఎన్నికలపైనే ప్రధానంగా దృష్టి సారించాం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం' అని స్పష్టం చేశారు.