ఆర్టీసీ కార్మికుల మానవహారం
NGKL: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ఆర్టీసీ కార్మికులు బస్సు స్టాండ్ వద్ద శ్రీశైలం ప్రధాన రహదారి పై బైఠాయించి నిరసన ప్రదర్శన చేసి, మానవహారం నిర్వహించారు. అనంతరం నర్సంపేట లో మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కు రెండు నిమిషాలు మౌనం పాటించి, సంతాపం తెలిపారు.