సరూర్ నగర్, ఎల్బీనగర్‌లో కురుస్తున్న వర్షం

RR: రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో ఎల్బీనగర్, చైతన్యపురి, సరూర్ నగర్ ప్రాంతాల్లో వర్షం ప్రారంభమైంది. భారీ వర్షం కురుస్తుండడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. కాగా.. మరో 5 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.