కరప ఎంపీడీవోగా రాంగోపాల్ నియామకం

KKD: కరప ఎంపీడీవోగా పనిచేస్తున్న అనుపమ పదోన్నతిపై భీమవరం బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో కొత్త ఎంపీడీవోగా ఎం. రాంగోపాల్ నియమితులయ్యారు. గతంలో ఇదే కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేసిన ఆయన ఈ నెల 16న బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు. నూతన ఎంపీడీవోను ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి, సత్తిబాబు తదితరులు అభినందించారు.