పోగొట్టుకున్న సెల్ ఫోన్లను బాధితులకు అప్పగింత
E.G: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ గుర్తించి యజమానులకు అప్పగించే ప్రత్యేక కార్యక్రమాన్ని గోకవరం ఎస్సై పవన్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఫోన్లను ట్రైస్ చేశామని ఎస్సై తెలిపారు. ఈ నెలలో అందిన ఫిర్యాదులతో మొత్తం 12 ఫోన్లను రికవరీ చేసి యజమానులకు అందజేశామన్నారు. వీటి విలువ రూ. 2,40,000 ఉంటుందన్నారు.