రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ
VZM: విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని కొండ కిండం గ్రామంలో మంగళవారం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పంపిణీ చేశారు. మీ భూమి మీ హక్కు ద్వారా ఈ కార్యక్రమం తహసీల్దార్ రాజేశ్వరరావు పర్యవేక్షణలో జరిగింది. మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పాస్ పుస్తకంపై రైతు ఫోటోతో పాటు ప్రభుత్వ రాజముద్ర వేయడం జరిగిందన్నారు.