నంద్యాలలో ప్రపంచ అవయవ దాన దినోత్సవం

NDL: పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని నిర్వహించారు. డాక్టర్ జి.రవికృష్ణ, డాక్టర్ గెలివి సహదేవుడు విద్యార్థులకు అవయవ దాన ప్రాధాన్యత, జీవితం కొనసాగించడానికి దాతల పాత్రపై అవగాహన కల్పించారు. మరణించిన తర్వాత రెండు నేత్రాలు, బతికుండగా మూత్రపిండం కూడా దానం చేయవచ్చని చెప్పారు.