రోడ్డు మరమ్మతులు చేపట్టండి సార్..!

ASR: హుకుంపేట మండలం పాటిగరువు గ్రామానికి వెళ్లే రోడ్డు అధ్వాన్నంగా మారిందని వాహనదారులు వాపోయారు. సంవత్సరం క్రితం కురిసిన భారీ వర్షాలకు సరసపాడు నుంచి పాటిగరువు వరకు ఉన్న రోడ్డు కొట్టుకుపోయి కోతకు గురైందని అన్నారు. దీంతో రాకపోకల సమయంలో ప్రమాదాల బారిన పడుతున్నామని అన్నారు. అధికారులు స్పందించి తారురోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.