బెట్టింగ్ గ్యాంగ్‌పై దాడి.. ఐదుగురి అరెస్టు
ASF: దహెగాంలో ఆన్లైన్ బెట్టింగ్ గ్యాంగ్ పై దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేసినట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు గురువారం తెలిపారు. రూ.65,270 నగదు, 5 మొబైల్ ఫోన్లు, టోకెన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. యువకులు 1-100 టోకెన్లతో సోషల్ మీడియా ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తూ ప్రజలను మోసగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు అక్రమ బెట్టింగ్స్‌పై కఠిన చర్యలు కొనసాగుతాయన్నారు.