ఆలయ ఏర్పాట్లను తనిఖీ చేసిన డీఎస్పీ
W.G: పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి దేవస్థానానికి సోమవారం భారీ స్థాయిలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని నరసాపురం డీఎస్పీ శ్రీవేద అధికారులను కోరారు. ఆదివారం రాత్రి ఆమె ఆకస్మికంగా క్యూలైన్ల ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులు దర్శనానికి వెళ్లేందుకు 12 క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు ఈవో ముచ్చర్ల శ్రీనివాస్ తెలిపారు.