అనాథ మృతదేహానికి అంత్యక్రియలు
KMM: ఖమ్మంలో మరణించిన యాచకుడి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి బంధువులు ఎవరూ రాలేదు. వన్ టౌన్ పోలీసులు మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. మృతుడు బొల్లం మల్లయ్యగా పోలీసులు గుర్తించారు. అయితే మృతదేహాన్ని ఎవరూ తీసుకెళ్లకపోవడంతో నిన్న పోలీసులు అన్నం ఫౌండేషన్ నిర్వహకుడు శ్రీనివాసరావుకు సమాచారం అందించగా తన సిబ్బందితో కలిసి అంత్యక్రియలు పూర్తి చేసారు.