VIDEO: రేపు ఊకలలో సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణ మహోత్సవం
WGL: గీసుగొండ మండలం ఊకలలోని ప్రసిద్ధ స్వయంభూ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో రేపు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు శ్రీ వల్లీ-దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ ఏడాది మయూర వాహన సేవ, మకరతోరణం ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. కళ్యాణ మహోత్సవ దర్శనం కోసం భక్తులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.