నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
VZM: శ్రీ క్షేత్రంలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 4వ తేదీ నుంచి 9వ తేదీ మాఘ బహుళ అష్టమి వరకు దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తలు దుర్గా బాలాజీ ఉమాదేవి దంపతులు పేర్కొన్నారు. దేవాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉత్సవ ప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనాలన్నారు.