'కేంద్ర పథకాలను అందరికి వర్తింపజేయాలి'
VZM: అసంఘటిత రంగ కార్మికుల సాంఘిక భద్రత కోసం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ధన్, అదే విధంగా ఇటీవలే చిరు వ్యాపారుల కోసం ప్రవేశపెట్టిన పీఎం లఘు వ్యాపారి మాన్ధన్ పథకాలను అర్హులందరికీ వర్తింపజేయాలని కలెక్టర్ రామ సుందర్ రెడ్డి ఆదేశించారు. మార్చిలోగా సుమారు 15వేల మందికి వర్తింపజేయాలని ఈమేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.