ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి
PDPL: ధర్మారం మండలం నాయికంపల్లి తండాకు చెందిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నవనందుల రాజేశ్ గోదావరి స్నానం చేసి బైక్‌పై ఇంటికి వస్తుండగా నిలిపి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈయనతో పాటు ఉన్న అరవెండి కిష్టయ్య మంగారపు సాయికుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108లో కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.