'దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది'

SRPT: సూర్యాపేట పట్టణంలోని కోమటికుంటలో ఆంజనేయ స్వామి ధ్వజస్తంభం మరియు ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొప్పుల వెణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఆంజనేయస్వామి మరియు ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.