రేవు పోలవరం తీరంలో పోలీసు గస్తీ
AKP: కార్తీక మాసం పురష్కరించుకుని పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎస్. రాయవరం మండలం రేవు పోలవరం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్ఐ విభీషణరావు, సిబ్బంది, మెరైన్ పోలీసులతో ఉదయం నుంచి సాయంత్రం వరకు తీర ప్రాంతంలో గస్తీ ఏర్పాటు చేశారు. సముద్రంలో స్నానాలు చేసే పర్యాటకులకు పలు హెచ్చరికలు జారీ చేశారు.